ప్రజాప్రతినిధుల కేసులను వేగంగా విచారించాలి | Parliamentary cases faster Proceeding | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధుల కేసులను వేగంగా విచారించాలి

Sep 8 2014 1:30 AM | Updated on May 24 2018 1:29 PM

అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయూలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ
 
న్యూఢిల్లీ: అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయూలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కేసులు నమోదైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో విచారణ రోజువారీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించి ఎప్పటికప్పుడు విచారణను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల విచారణను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయూలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేంద్రం కదిలింది. రెండేళ్లు, అంతకుమించి శిక్షకు గురైన చట్టసభ సభ్యులకు అనర్హత వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. కళంకిత సభ్యులపై చర్యలు చేపట్టి ఏడాదిలోగా రాజకీయూలను ప్రక్షాళన చేసేందుకు యంత్రాంగాన్ని రూపొందించాలని ప్రధాని నరేంద్రమోడీ గత జూలై 24వ తేదీన హోంశాఖ, న్యాయశాఖను ఆదేశించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్రాలకు లేఖ రాయూలని నిర్ణయం తీసుకున్నారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా దీనికి సంబంధించి రాష్ట్రాలకు వేర్వేరుగా లేఖలు రాశారు.
 
హోంశాఖ లేఖలో ప్రధానాంశాలు..

ఆరోపణలు రుజువైన చట్టసభ సభ్యులపై అనర్హత వేటు విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలి. రోజువారీ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత జడ్జిని కోరాలి. ప్రాసిక్యూటర్ల కొరత ఉంటే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాష్ట్రాలు నియమించాలి. కేసు విచారణ పురోగతిని రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు సమీక్షిస్తే మంచిది. ప్రాసిక్యూషన్‌కు మద్దతుగా సాక్ష్యాలు, వైద్య నివేదికలు ప్రవేశపెట్టడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.  కేసులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థారుులో సమన్వయ కమిటీని నియమించాలి. జిల్లా సెషన్స్ జడ్జి దీనికి నేతృత్వం వహిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement