పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీ శనివారం వరకు పొడిగించారు.
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీ శనివారం వరకు పొడిగించారు. సమావేశాలు ప్రారంభం నుంచి తెలంగాణ, సమైక్యాంధ్రతో పాటు వివిధ సమస్యలపై అధికార ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో గడిచిపోయింది. దాంతో అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితులలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదానికి సమావేశాల కాలాన్ని పొడిగించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 5న ప్రారంభం అయ్యాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సమావేశాలు ఆగస్టు 30వ తేదీ వరకు మాత్రమే జరగాలి. అయితే ఆందోళనతో సభల సమయం వృధా కావడంతో సమావేశాల కాలాన్ని తొలుత ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించారు. పెన్షన్ ఫండ్, భూ ఆక్రమణల వంటి బిల్లులు ఆమోదించవలసి ఉన్నందున మళ్లీ రెండవ సారి మరో రోజు పొడిగించారు.