ఆర్జేడీ నుంచి పప్పూ యాదవ్ బహిష్కరణ | pappu Yadav expulsion from theRJD | Sakshi
Sakshi News home page

ఆర్జేడీ నుంచి పప్పూ యాదవ్ బహిష్కరణ

May 8 2015 1:47 AM | Updated on Sep 3 2017 1:36 AM

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో ఆర్జేడీ చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ ఎంపీ పప్పూ యాదవ్‌ను గురువారం పార్టీనుంచి బహిష్కరించారు.

పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో ఆర్జేడీ చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ ఎంపీ పప్పూ యాదవ్‌ను గురువారం పార్టీనుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పప్పూయాదవ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆర్జేడీ ప్రధాన కార్యదర్శి రామ్‌దేవ్ భండారీ మీడియాకు తెలిపారు. జనతా పరివార్ పార్టీల విలీనం అంశంపై పప్పూ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో తీవ్రస్థాయిలో విభేదించారు.

పప్పూ యాదవ్‌కు గత నెలలోనే షోకాజ్ నోటీసు జారీ చేశామని, ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్ కమిటీలో చర్చించి బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌జేడీ ఎంపీ జయ్‌ప్రకాశ్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement