కేంద్ర ప్రభుత్వం ఇకపై మొబైల్ యాప్ ద్వారానే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)అందించాలని భావిస్తోంది.
నిమిషాల్లో పాన్‌కార్డు..
Feb 23 2017 3:20 PM | Updated on May 25 2018 6:12 PM
న్యూడిల్లీ: స్మార్ట్‌ఫోన్ ద్వారా టాక్స్ చెల్లింపులను ప్రోత్సహిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇకపై మొబైల్ యాప్ ద్వారానే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) అందించాలని భావిస్తోంది. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ విధానంలో పాన్ నంబర్‌ను జారీచేసే ప్రయత్నంలో ఆదాయపన్ను శాఖ ప్రయత్నం చేస్తోంది.
బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తుదారుడి చిరునామా, పుట్టిన తేదీని తెలుసుకోవచ్చని తద్వారా నిమిషాల్లో పాన్‌కార్డు నంబర్ జారీ చేయవచ్చని చెప్పారు. పాన్‌కార్డు కోసం దరఖాస్తు మొబైల్లో దరఖాస్తు చేసుకోవడం రిటర్న్‌లు ట్రాక్‌చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. సిమ్ కార్డు జారీకి ఉపమోగిస్తున్న తరహా ప్రక్రియనే పాన్ కార్డు జారీకి అనుసరించనున్నట్లు సమాచారం. దీనిగూర్చి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement