
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు నేపథ్యంలో 87 శాతం మంది ఢిల్లీ ప్రజలు బాణాసంచాకు దూరంగా ఉన్నట్లు ఒక సర్వే ప్రకటించింది. కేవలం 5 శాతం మంది ప్రజలు మాత్రం దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కాల్చేందుకు సిద్ధపడుతున్నట్లు సర్వే పేర్కొంది. దీపావళి-బాణాసంచాపై నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఢిల్లీలో లోకల్ సర్కిల్స్ సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తిర విషయాలు వెలుగు చూశాయి.
ప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 87 శాతం మంది ప్రజలు పటాకులు కాల్చడంపై అయిష్టతను వ్యక్తం చేశారు. ఇందులో కేవలం 5 శాతం అంటే 4,600 మంది తమ దగ్గర ఇప్పటికే పటాకులు ఉన్నాయని.. వాటిని కాలుస్తామని తెలిపారు. మరో శాతం మంది మాత్రం.. తమకు బాణాసంచా కాల్చడం ఇష్టమేనని అయితే అక్రమంగా వాటిని సంపాదిండం మాత్రం తెలియదని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే ప్రకటించింది. ముఖ్యంగా దీపావళి సమయంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో ఉండే కాలుష్యంతో పోలిస్తే.. దీపావళి సమయంలో ఐదు రెట్లు అధికంగా ఉంటుంది.