ప్రకృతి కన్నెర్ర | Over 100 Dead After Storm, Rain Hit Uttar Pradesh, Rajasthan | Sakshi
Sakshi News home page

ప్రకృతి కన్నెర్ర

May 4 2018 1:52 AM | Updated on Aug 28 2018 8:41 PM

Over 100 Dead After Storm, Rain Hit Uttar Pradesh, Rajasthan - Sakshi

ఈదురు గాలుల ధాటికి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో కుప్పకూలిన భారీ వృక్షం

లక్నో/జైపూర్‌: ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లపై ప్రకృతి విరుచుకు పడింది. ఈ రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇసుక తుపాన్‌తో పాటు ఈదురు గాలులు, భారీ వర్షాలు విధ్వంసం స్టృష్టించాయి. వీటి ధాటికి దాదాపు 110 మంది మృత్యువాత పడ్డారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీస్థాయిలో ఆస్తినష్టం వాటిల్లింది. గంటకు 100 కి.మీకు పైగా వేగంతో బలమైన గాలులు వీయ డంతో నష్ట తీవ్రత భారీగా ఉంది. రెండు రాష్రా ్టల్లోనూ పలు చోట్ల ఇళ్లు, చెట్లు, విద్యుత్‌ స్థంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది.

ఓవర్‌హెడ్‌ తీగలు తెగిపడటంతో రైలు సేవలకు అంతరాయం కలిగింది. గ్రామీణ ప్రాంతా ల్లో చేతికొచ్చిన పంట నేలపాలయ్యింది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హరియాణాలో ఏర్పడిన ఆవర్తన ద్రోణే ఈ విపత్తుకు కారణమని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) ప్రకటించింది. ఇసుక తుపాన్‌ ఘటనలో జరిగిన ప్రాణ నష్టంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సత్వరం ఉపశమనం కలిగేలా సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

యూపీలోనే 70 మంది మృతి..
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 70 మందికి పైగా మృతిచెందగా, 83 మంది గాయపడ్డారు. రాజస్తాన్‌లో 36 మంది మరణించారు. యూపీలోని ఆగ్రాలో 43 మంది చనిపోగా, 51 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆగ్రా, బిజనూర్, రాయ్‌బరేలి, సహరాన్‌పూర్, ఫిలిబిత్, ఫిరోజాబాద్, చిత్రకూట్, ముజఫర్‌నగర్, ఉన్నావ్‌ జిల్లాల్లోనూ ఇసుక తుపాన్‌ ప్రభావం అధికంగా ఉంది. రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో ఈ తుపాన్‌ ధాటికి అత్యధికంగా 19 మంది మృత్యువాతపడ్డారు.

ధోల్పూర్‌ జిల్లాలో గరిష్టంగా ఇసుక తుపాన్‌ బీభత్సం సుమారు 45 నిమిషాల పాటు కొనసాగింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, 60 శాతం గాయపడిన వారికి రూ. 2 లక్షలు, 40–50 శాతం గాయాలైన వారికి రూ.60 వేలు పరిహారంగా చెల్లిస్తామని  రాజస్తాన్‌ విపత్తుల నిర్వహణ కార్యదర్శి హేమంత్‌ కుమార్‌ తెలిపారు. ఇసుక తుపాన్‌ విపత్తుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్తాన్‌ సీఎం వసుంధరా రాజే సింధియా కూడా విచారం వ్యక్తం చేశారు.

పొంచి ఉన్న మరో ముప్పు: ఆవర్తన ద్రోణి కారణంగా యూపీ, రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలకు రాబోయే 48 గంటల్లో మరో ఇసుక తుపాను రానుందని ఐఎండీ హెచ్చరించింది. రాజస్తాన్‌లో గాలుల వేగం మరింత పెరిగేందుకు అవకాశము న్నట్లు తెలుస్తోందని, ఫలితంగా కారౌలీ, ధోల్పూర్‌లో ఇసుక తుపాన్‌ రావొచ్చని ఐఎండీ శాస్త్రవేత్త హిమాన్షు శర్మ తెలిపారు. దేశంలోని పలు ప్రాంతా ల్లో ఉరుములు, పిడుగులతో వర్షం బీభత్సం సృష్టించే ముప్పుందని ఐఎండీ కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీచేసినా ఆ జాబితాలో యూపీ, రాజస్తాన్‌ లేకపోవడం గమనార్హం..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement