తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలి | operate International flights from tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలి

Dec 28 2017 4:17 PM | Updated on Jul 25 2018 6:05 PM

 operate International flights from tirupati - Sakshi

సాక్షి, న‍్యూఢిల్లీ : తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చినా అక‍్కడి నుంచి విదేశాలకు  విమానాలు తిరగడంలేదని వైఎస్సార్‌సీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన పార‍్లమెంట్‌లో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక‍్తులు వస్తుంటారని గుర్తుచేశారు. అంతే కాకుండా రాయలసీమ నుంచి ఉపాధి కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళుతున్నారని పేర్కొన్నారు.

సాక్షాత్తూ ప్రధానమంత్రి అంతర్జాతీయ వైమానిక సేవలను ప్రారంభించినా అవి అమల్లోకి రాలేదన‍్నారు. కేంద్ర ప్రభుత‍్వం వెంటనే స‍్పందించి తిరుపతి విమానాశ్రయం నుంచి విదేశాలకు ఎయిర్‌ ఇండియా విమానాలను నడపాలని డిమాండ్‌ చేశారు. అలాగే కడప ఎయిర్‌ పోర్టులో రన్‌వే విస‍్తరణ ఎప‍్పటిలోగా పూర‍్తవుతుందో తెలపాలని కోరారు. అత‍్యంత వెనుకబడిన ప్రాంతమైన కడప విమానాశ్రయ అభివృద్ది పనులను సాధ‍్యమైనంత త‍్వరగా పూర్తిచేయాలని విజ‍్ఞప్తి చేశారు.

తిరుపతి నుండి విదేశాలకు విమానాలు నడపండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement