పాతరూపంలో కొత్త రూపాయి | Sakshi
Sakshi News home page

పాతరూపంలో కొత్త రూపాయి

Published Sun, Aug 23 2015 10:16 AM

పాతరూపంలో కొత్త రూపాయి

అమలాపురం : కేంద్ర ప్రభుత్వం 21 ఏళ్ల తర్వాత తిరిగి రూపాయి నోట్లని ముద్రించింది. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి సంతకంతో ఉన్న ఈ నోటుని ఇటీవలే రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ మందిరంలో విడుదల చేశారు. గులాబీ, ఆకుపచ్చల మిశ్రమ వర్ణంతో కనిపించే ఈ నోటు వెనుక, ముందు భాగాలు 1980, 1990 దశకాల్లో ముద్రించిన రూపాయి నోట్లనే పోలి ఉన్నాయి.

పాతనోట్లకు లాగే నోటుకు ఓ వైపు సముద్రంలో ఓఎన్‌జీసీ కార్యకలాపాలను సూచించే చిత్రాన్ని ముద్రించారు.ఈ కొత్త రూపాయి నోట్లను అమలాపురానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం సేకరించారు. ముంబైలోని తన మిత్రుని ద్వారా ఈ కొత్త రూపాయి నోట్లకట్టను సేకరించినట్లు ఆయన చెప్పారు.
 

Advertisement
Advertisement