టాయిలెట్‌లో కిలోన్నర బంగారం! | One and half KGs gold in the toilet! | Sakshi
Sakshi News home page

టాయిలెట్‌లో కిలోన్నర బంగారం!

Apr 7 2015 3:16 AM | Updated on Aug 28 2018 5:25 PM

టాయిలెట్‌లో  కిలోన్నర బంగారం! - Sakshi

టాయిలెట్‌లో కిలోన్నర బంగారం!

సింగపూర్ నుంచి చెన్నైకి ఆదివారం రాత్రి చేరుకున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలోని టాయిలెట్‌లో రూ.48 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 చెన్నై : సింగపూర్ నుంచి చెన్నైకి ఆదివారం రాత్రి చేరుకున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలోని టాయిలెట్‌లో రూ.48 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానంలోని ప్రయాణికులు దిగిన వెంటనే టాయిలెట్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది టాయిలెట్లో నల్లని సంచిని చూసి బాంబుగా భయపడ్డారు. బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది పరిశీలించి తెరిచిచూడగా అందులో 1.5 కిలోల బరువున్న రెండు బంగారు బిస్కెట్లు అందులో ఉన్నాయి.

సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న ఈ విమానం మరికొద్ది సేపటికి ముంబాయికి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ విషయం ప్రయాణికులకు తెలిసే అవకాశం లేదు. టాయిలెట్‌లోని బంగారాన్ని ముంబయికి చేరవేసేందుకు విమానాశ్రయ సిబ్బంది ఎవరో స్మగ్లర్లకు సహకరించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement