వాట్సప్లో అసభ్య మెసేజ్.. అధికారి సస్పెండ్ | Officer sends vulgar messages to female colleague | Sakshi
Sakshi News home page

వాట్సప్లో అసభ్య మెసేజ్.. అధికారి సస్పెండ్

Dec 2 2016 2:49 PM | Updated on Sep 4 2017 9:44 PM

వాట్సప్లో అసభ్య మెసేజ్.. అధికారి సస్పెండ్

వాట్సప్లో అసభ్య మెసేజ్.. అధికారి సస్పెండ్

వాట్సప్లో అభ్యంతరకరమైన మెసేజ్ చేసిన ఓ అధికారి విధుల నుండి సస్పెండ్ అయ్యాడు.

ముజఫర్నగర్: వాట్సప్లో అభ్యంతరకరమైన మెసేజ్ చేసిన ఓ అధికారి విధుల నుండి సస్పెండ్ అయిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్నగర్లో చోటుచేసుకుంది.
 
వివరాలు.. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న సతీష్ కుమార్ ఓ మహిళా అధికారినికి అసభ్యకరమైన మెసేజ్ చేశాడు. అదికూడా.. డిపార్ట్మెంట్ అధికారులంతా పరస్పరం సమాచారాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్లో.. ఓ మహిళా అధికారిని ఉద్దేశిస్తూ సతీష్ ఈ అభ్యంతరకరమైన మెసేజ్ చేశాడు. దీంతో బాధిత మహిళా అధికారి డిస్టిక్ డెవలప్మెంట్ ఆఫీసర్(డీడీఓ)కు ఫిర్యాదు చేశారు. వెంటనే సతీష్ కుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు డీడీఓ మోతీలాల్ వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement