
1200 కోట్లు ఇస్తామన్నారు: హార్దిక్ పటేల్
గుజరాత్‌లో పటేళ్లకు ఓబీసీల్లో స్థానం కల్పించాలంటూ గత సంవత్సరం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించిన హార్దిక్ పటేల్..
అహ్మదాబాద్: గుజరాత్‌లో పటేళ్లకు ఓబీసీల్లో స్థానం కల్పించాలంటూ గత సంవత్సరం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించిన హార్దిక్ పటేల్.. బీజేపీపై తీవ్రస్థాయి ఆరోపణతో మరోసారి తెరపైకి వచ్చాడు. ఉద్యమాన్ని విరమిస్తే రూ. 1200 కోట్లతో పాటు బీజేపీ జాతీయ యువజన విభాగం అధ్యక్ష పదవి ఇస్తామంటూ గుజరాత్ ప్రభుత్వం తనకు ప్రతిపాదించిందని ఆరోపించారు.
ప్రస్తుతం సూరత్ జైళ్లో ఉన్న హార్దిక్ పటేల్ రాశాడంటూ ఈ వివరాలతో ఉన్న ఒక లేఖను పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి శుక్రవారం పలు మీడియా సంస్థలకు పంపించింది. గుజరాత్ ప్రభుత్వంలోని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి జైళ్లో ఉన్న తన వద్దకు వచ్చి ఈ ఆఫర్ ఇచ్చారని తన తల్లిదండ్రులను ఉద్దేశించి రాసిన ఆ లేఖలో హార్దిక్ పటేల్ పేర్కొన్నారు.