పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం

Nusrat Jahan, Mimi Chakraborthy Take Oath As Lok Sabha Members  - Sakshi

తృణముల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీగా  ఎన్నికయిన నుస్రత్‌ జహాన్, మిమి చక్రబర్తీలు లోక్‌సభ  సభ్యులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తమ  ప్రమాణ స్వీకారం ’బంగ్లా’లో చేసిన వీరు, తమ ప్రసంగం చివరలో  ’వందేమాతరం’, ’జై హిందీ’, ’జై బంగ్లా’ వంటి పదాలు  ఉపయోగించారు. తర్వాత వెంటనే లోక్‌సభ స్పీకర్‌ ’ఓం  బిర్లా’కు పాదాభివందనం చేశారు.

నుస్రత్‌ జహాన్‌ ఇటీవలే టర్కీకు  చెందిన వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ను వివాహం చేసుకోగా, మిమి  చక్రబర్తీ ఆ వేడుకకు హాజరయ్యారు. దీంతో మంగళవారం సభకు  వచ్చిన ఈ ఇద్దరు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  నుస్రత్‌ జహాన్‌ బసిర్‌హాట్, మిమి జాదవ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు  ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top