వాడియా తండ్రికి రవి పూజారి బెదిరింపులు | Nusli Wadia group files complaint alleging threat from underworld | Sakshi
Sakshi News home page

వాడియా తండ్రికి రవి పూజారి బెదిరింపులు

Jun 18 2014 1:10 PM | Updated on Sep 2 2017 9:00 AM

అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి మొబైల్ ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని వాడియా గ్రూప్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ముంబై డిప్యూటి పోలీస్ కమిషనర్ మహేశ్ పటేల్ తెలిపారు.

ముంబై: అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి మొబైల్ ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని వాడియా గ్రూప్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ముంబై డిప్యూటి పోలీస్ కమిషనర్ మహేశ్ పటేల్ తెలిపారు. 
 
రవి పూజారి నుంచి బెదిరింపు మెసెజ్ వస్తున్నట్టు పారిశ్రామిక వేత్త నుస్లీ వాడియా కార్యదర్శి ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేసినట్టు మహేశ్ పటేల్ చెప్పారు. నెస్లీ వాడియా కార్యదర్శి పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. 
 
అయితే నెస్లీ వాడియా ఫోన్ కు వచ్చాయా లేక కార్యదర్శి మొబైల్ వచ్చాయా అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. నెస్లీవాడియా కుమారుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, మాజీ ప్రేయసి ప్రీతి జింటా మే 30 తేదిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడంతో వాడియా కుటుంబ పేరు మీడియాలో వినిపిస్తోంది. 
 
నెస్ వాడియా, ప్రీతి జింటాలకు కేసు నేపథ్యంలో బెదిరింపులు వచ్చాయా అనే విషయంపై ఓ అవగాహనకు రాలేదని పోలీసులు తెలిపారు. తాజా ఫిర్యాదుపై వాడియా గ్రూప్ ప్రతినిధులు స్పందించడానికి అందుబాటులోకి రానట్టు తెలుస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement