రాయితీల భారం తగ్గించుకోవడానికి రైల్వే.. సీనియర్ సిటిజన్లు రైల్వే ప్రయాణ చార్జీల్లో రాయితీని స్వచ్ఛందంగా వదులుకునేందుకు ఆప్షన్‌ను తెస్తోంది.
న్యూఢిల్లీ: రాయితీల భారం తగ్గించుకోవడానికి రైల్వే.. సీనియర్ సిటిజన్లు రైల్వే ప్రయాణ చార్జీల్లో రాయితీని స్వచ్ఛందంగా వదులుకునేందుకు ఆప్షన్‌ను తెస్తోంది. అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
పూర్తి చార్జీని చెల్లించే స్థోమత కలిగిన వృద్ధులు ఉన్నారని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వయో వృద్ధులకు రూ. 1,100 కోట్ల రాయితీ ఇచ్చామన్నారు.