ఉస్తాద్‌ ఇమ్రత్‌ ఖాన్‌ కన్నుమూత

Noted classical musician Ustad Imrat Khan pass away - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్‌ ఇమ్రత్‌ ఖాన్‌ (83) అనారోగ్యం కారణంగా అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు శుక్రవారం వెల్లడించారు. సితార్, సుర్‌బహర్‌లను వాయించడంలో ఇమ్రత్‌ ఖాన్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. గుండెపోటు రావడంతో మిస్సౌరిలోని సెయింట్‌ లూయిస్‌ వైద్యశాలలో ఇమ్రత్‌ కన్నుమూశారు. ఇమ్రత్‌ అంత్యక్రియలు శనివారం జరుగుతాయి.  ఇమ్రత్‌ ఖాన్‌ తన జీవితాన్ని సితార్, సుర్‌బహర్‌లను వాయించేందుకే అంకితం చేశారు. గతేడాదే కేంద్రం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇవ్వగా, తన ప్రతిభను కేంద్రం ఆలస్యంగా గుర్తించిందంటూ అవార్డును తిరస్కరించారు. ఇమ్రత్‌ ఖాన్‌ కుటుంబానికి 400 ఏళ్ల సంగీత చరిత్ర ఉంది.బాస్‌ సితార్‌గా పిలిచే సుర్‌బహర్‌ వాయిద్య పరికరాన్ని వీరి వీరి కుటుంబమే తయారు చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top