breaking news
classical musician
-
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్‌స్టోన్ డైమండ్‌రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్‌లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్‌లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్‌గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న!
సాక్షి, సిటీబ్యూరో: ‘సంగీతంలో రాణించాలని అనుకోవడం మంచిదే. అయితే అదే సమయంలో చదువును ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు’ అంటున్నారు ప్రియా సిస్టర్స్. ఉన్నత చదువులు చదివి ఆ తర్వాత శాస్త్రీయ సంగీతంలో లబ్ధప్రతిష్టులుగా పేరొందిన అచ్చతెలుగు అక్కా చెల్లెళ్లు హరిప్రియ, షణ్ముఖ ప్రియలు వేల సంఖ్యలో కచేరీలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో పుట్టి అద్భుతమైన గానామృతాన్ని పంచుతూ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మహిళ ప్రతిభను చాటారు. శ్రీ వాసవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నగరంలోని రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో సంభాషించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే...జన్మ ధన్యమైన సందర్భాలెన్నో... ‘జీవనసాఫల్య పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మా జీవితం ధన్యమైంది అనకున్న సందర్భాలను మననం చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.. పుట్టపర్తి సాయిబాబా గారి ముందు కచేరీ నిర్వహించడమే కల సాకారం అవడం అనుకుంటే, కచేరీ ముగిశాక మరోసారి ఓ కీర్తన ఆలపించమంటూ ప్రత్యేకంగా అడగడం... అలాగే శాస్త్రీయ సంగీతంలో వశిష్టుడు అని చెప్పదగ్గ స్వర్గీయ సుబ్బుడు (పి.వి.సుబ్రహ్మణ్యం)... మా సిస్టర్స్‌ని అనేక రకాలుగా ప్రశంసిస్తూ.. ట్రాన్సిస్టర్స్ అంటూ గొప్పగా అభివరి్ణంచడం... కంచి పరమాచార్య గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన ముందు పాడడం, ఆయన ప్రసాదం ఇవ్వడం...ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇంకా జన్మ ధన్యం కావాల్సిన సందర్భాలు ఎన్నో రానున్నాయనే అనుకుంటాం’.సినిమా తాపత్రయం లేదు... శాస్త్రీయ సంగీతానికి తనదైన ప్రత్యేకత ఉంది. దానికే పరిమితమైన మేం సినిమా సంగీతంతో మమేకం కాలేదు.. కాలేం కూడా. మూడు నాలుగు సినిమాల్లో పాటలు పాడామంటే ఆయా సినిమాల రూపకర్తలకు ఆ పాటకు మా గాత్రం నప్పుతుందని మమ్మల్ని సంప్రదించడం వల్లే తప్ప సినిమా అవకాశాల గురించి మేం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక సినిమా నటన గురించి అంటే... చాలాకాలం క్రితం కె.బాలచందర్ గారు నన్ను (హరిప్రియ) సింధుబైరవి సీక్వెల్ సినిమా తీస్తున్న సందర్భంలో ఓ పాత్రకు అడిగారు. అయితే ఎందుకో అది కుదరలేదు.పాపులారిటీ సరే... లాంగ్విటీ కూడా అవసరమే... సాంకేతిక విప్లవం పుణ్యమాని పాపులారిటీ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే షార్ట్ టర్మ్ పాపులారిటీ కన్నా దీర్ఘకాలం పాటు నిరూపించుకునే స్థిరత్వం ముఖ్యం. ప్రస్తుతం యువ కళాకారులకు శిక్షణ ఇస్తున్నాం. 2, 3 ఏళ్లలో అకాడమీని స్థాపించాలని అనుకుంటున్నాం. మా పిల్లల్లో ఎవరూ మా వారసులుగా రావాలని అనుకోవడం లేదు. మేం ఒత్తిడి చేయడం లేదు. మా చివరి శ్వాస వరకూ కచేరీలు ఇస్తూనే ఉండాలి.. భావి తరాలకు శాస్త్రీయ సంగీతం పంచాలని తప్ప...వేరే కలలు, లక్ష్యాలు అంటూ ఏమీ లేవు.నా మనసు పాటనే ఎంచుకుంది..నేను (హరిప్రియ) చిన్న వయసులో క్రికెటర్‌గా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఆడాననేది నిజమే. అలాగే మరోవైపు శాస్త్రీయ సంగీతంలోనూ రాణిస్తున్న ఆ సమయంలో ఏ రంగం ఎంచుకోవాలి? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నా మనసు పాట వైపే మొగ్గింది. నేడు మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగడం చూస్తున్నా...అది ఆనందాన్నిస్తోంది. నా చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితే ఉన్నా సంగీతాన్నే కెరీర్‌గా ఎంచుకునేదాన్ని తప్ప క్రికెట్‌ను కాదనేది నిజం. -
ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (83) అనారోగ్యం కారణంగా అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు శుక్రవారం వెల్లడించారు. సితార్, సుర్‌బహర్‌లను వాయించడంలో ఇమ్రత్ ఖాన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. గుండెపోటు రావడంతో మిస్సౌరిలోని సెయింట్ లూయిస్ వైద్యశాలలో ఇమ్రత్ కన్నుమూశారు. ఇమ్రత్ అంత్యక్రియలు శనివారం జరుగుతాయి. ఇమ్రత్ ఖాన్ తన జీవితాన్ని సితార్, సుర్‌బహర్‌లను వాయించేందుకే అంకితం చేశారు. గతేడాదే కేంద్రం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇవ్వగా, తన ప్రతిభను కేంద్రం ఆలస్యంగా గుర్తించిందంటూ అవార్డును తిరస్కరించారు. ఇమ్రత్ ఖాన్ కుటుంబానికి 400 ఏళ్ల సంగీత చరిత్ర ఉంది.బాస్ సితార్‌గా పిలిచే సుర్బహర్ వాయిద్య పరికరాన్ని వీరి వీరి కుటుంబమే తయారు చేసింది. -
గానకళానిధి డా॥వింజమూరి
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు గానకళానిధి డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ 1915 జూలై 15న గుంటూరులో జన్మించారు. తల్లి కనకవల్లి తాయార్. తండ్రి వింజమూరి భావనాచారి. శ్రీమం తులైన జననీ జనకుల సమక్షంలో సరోజిని నాయు డు, మహాత్మాగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి జాతీయ నాయకులతో, వీణ శేషణ్ణ, టైగర్, పచి అయ్యంగార్ వంటి సంగీత ప్రముఖులతో మంచి పరిచయం ఏర్పడింది. ముక్త్యాల సంస్థాన సంగీత విద్వాంసులు పిరాట్ల శంకరశాస్త్రి గారి వద్ద సహోదరి శకుంతల సంగీతం నేర్చుకునే సమయంలో, పసిత నంలోనే వీరికి కూడా సంగీతంలో ఆసక్తి కలిగింది. అది గమనించిన గురువు ఆ పిల్లవానికి కూడా సం గీత పాఠం ఆరంభించారు. వింజమూరి గురువు గారి పాఠాలని అయస్కాంతంలా ఆకర్షించి గ్రహిం చేవారు. ఏడేళ్ల వయస్సులో వారి తొలి కచ్చేరి మైసూ రు ఆస్థాన విద్వాంసులు వీణ శేషణ్ణ సమక్షంలో జరి గింది. పళ్లెం పూర్ణప్రజ్ఞ వద్ద సంస్కృతం, ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ బీఏ పట్టభద్రులయ్యారు. 1935లో వీరికి విమలాదేవితో వివాహం జరిగింది. 1936లో మదరాసు వెళ్లి వరదాచార్యర్ వద్ద శిష్యు డిగా చేరారు. మదరాసు విశ్వవిద్యాలయంలో సంగీ త విద్వాన్ కోర్సులో అత్యుత్తమ శ్రేణి లో ముగించారు. ఒక కళాకారుని సాధనమే వారి అభివృద్ధికి ప్రథమ సోపానమని నమ్మి న వింజమూరి రోజుకు 7 నుంచి 14 గంటల వరకు సాధన చేసేవారట. ఆయన ఆసేతు హిమాచలం, బర్మా, సిలోన్, మలేషియా, రంగూన్ వంటి పలు చోట్ల 1945 నుంచి అనేక వేల కచ్చేరీలు చేశా రు. సంగీత సాహిత్య వక్త, రచయిత, పరిశోధకులు గా సంగీత ఎన్సైక్లోపీడియాగా పేరుగాంచారు. 22వ ఏట శృంగేరిస్వామి వద్ద గానవిద్యా విశారద బిరుదుని పొందారు. తర్వాత పలు సంస్థలు, సంస్థా నాలచే అనేక బిరుదులతో గౌరవం పొందారు. జమీందారుల సంస్థానాల్లో, రాజదర్బారుల్లలో, రాష్ట్రపతుల సమక్షంలో వారు చేసిన కచ్చేరీలు కోకొల్లలు. తమ 75 ఏళ్ల జీవితకాలంలో అనేక సభలకు అధ్యక్ష పదవులు వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మొట్టమొదటి సంగీత కళాశాలను హైదరాబాద్‌లో స్థాపించి దానికి తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. అనేక సం గీత విద్యాసంస్థల స్థాపనకి కారకుల య్యారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలకు ఎగ్జామినర్‌గా ఉన్నారు. ఆకా శవాణిలో సంగీత విభాగ ప్రయోక్తగా వివిధ ప్రసారాలను సృష్టించారు. 1943లో మద్రాసు రేడియో కేంద్రంలో వింజ మూరి ప్రవేశపెట్టిన గానలహరి సంగీత శిక్షణ కార్య క్రమాన్ని ఇతర కేంద్రాలు కూడా అనుసరించాయి. రాగమ్ తానమ్ పల్లవి శీర్షికను ప్రసారం చేసి ఆ అపూర్వ సంగీత ప్రకరణాన్ని ప్రజలకు పరిచయం చేశారు. సుప్రసిద్ధ విద్వాంసులను దేశంలోని పలు ప్రాంతాలనుంచి రప్పించి లయ విన్యాసము ప్రసాక కార్యక్రమం నిర్వహించారు. ప్రసిద్ధ సంగీత వాగ్గేయ కారులను, వారి రాగాల గురించి ప్రసంగించేవారు. భక్తి రంజని కార్యక్రమం మొదలెట్టి మొట్టమొదటిగా అన్నమాచార్య కీర్తనలకు వర్ణమెట్టు కట్టి ప్రసారం చేశారు. వింజమూరి వారు త్యాగరాజు, శ్యామాశాస్త్రి వంటి వాగ్గేయకారుల జీవితాల చరిత్రలను గురించి మాత్రమే కాక, ఇతర వాగ్గేయకారుల గురించి ప్రస్తా వించి, వాటిని ప్రసారం చేశారు. ఆయన సంగీతంలో దిట్ట, ఘనరాగ మాలికా వర్ణం, స్వరరంజని, సింధురామక్రియ వంటి అపూ ర్వ రాగాలలో వర్ణాలు, శంకరిరాగంలో తిల్లానా, మణిరంగులో జావళీ వంటి అపూర్వ రచనలను చేసిన వాగ్గేయకారులు, అనేక నూతన ప్రక్రియలను ప్రసారాలను సంగీత ప్రపంచానికి అందించిన సృజ నాత్మక మూర్తి. ఇంతటి విద్యా విజ్ఞాన నిలయం సం గీత ప్రపంచంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు- కానేరదు. గత 23 సంవత్సరాలుగా వింజ మూరి పేరిట అనేక అవార్డులు, అనేక ఉత్సవాలు నడుస్తున్నాయి. అందులో పలు ప్రముఖులైన విద్వాంసులు వారి రచనలను పాడి ఉన్నారు. వింజ మూరి వారి శత జయంతి ఈ సంవ త్సరం జులై 15 నుంచి పలు ప్రదేశాలలో ఘనంగా జరగనున్నది. (జూలై 15న వింజమూరి వరదరాజ అయ్యంగార్ శత జయంతి) సంధ్యా రంగన్ గిరి, (వింజమూరి కుమార్తె) చెన్నయ్, ఫోన్: 044-22263320


