
మరో ఐదేళ్లలో ఆ ఘనత సాధ్యమే : నితిన్ గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ ఆర్ధికాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందని జాతీయ రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి రోడ్ మ్యాప్‌లా బడ్జెట్‌ను రూపొందించారని ప్రశంసించారు. గత ఐదేళ్లలో తాము ఆర్థిక వ్యవస్ధను రెట్టింపుకు చేర్చామని, ఇప్పటినుంచి మరో ఐదేళ్ల తమ పదవీ కాలం ముగిసే లోగా మన ఆర్థిక వ్యవస్ధను 5 లక్షల కోట్ల డాలర్ల స్ధాయిని అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు నిర్మలా సీతారామన్ బడ్జెట్ మధ్యతరగతికి మేలు చేసేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. యువతకు, గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయ రంగానికి బడ్జెట్ ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఐదేళ్ల అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శిగా నిలుస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.