ఉరి అమలు: స్వీట్లు పంచుకున్న స్థానికులు

Nirbhaya Convicts Hanged To Death Natives Celebrations At Tihar Jail - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన తీహార్ జైలు వద్ద స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. నిర్భయ వర్థిల్లాలి, భారత్‌ మాతా​కి జై అంటూ నినాదాలు చేశారు. కొందరు జాతీయ జెండా ప్రదర్శించారు.  కాగా, నిర్భయ దోషులు ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)ను ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీహార్‌ సెంట్రల్‌ జైలులోని జైలు నెంబర్‌ 3లో ఉరితీసిన సంగతి తెలిసిందే. ఇక జైలు వద్దకు చేరుకున్న వారిలో సామాజిక కార్యకర్త యోగితా భయానా కూడా ఉన్నారు. ‘నిర్భయకు న్యాయం జరిగింది. మిగతా బాధితులకు కూడా న్యాయం జరగాలి’ అనే పోస్టర్‌ను ఆమె ప్రదర్శించారు. నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం​)

కష్టతరమైన యుద్ధంలో విజయం సాధించామని నిర్భయ కుంటుంబం సన్నిహితుడు అకాశ్‌ దీప్‌ అన్నారు. ఉరి శిక్ష నిర్ణయం, అమలు.. మంచిదే.. కానీ, శిక్ష అమలు ఇంతలా ఆలస్యం కాకుండా... ముందే జరగాల్సిందని దివ్యా ధావన్‌ అనే మహిళా అన్నారు.  ‘నిర్భయ దోషులకు ఉరి అమలుతో సమాజం  ఏమీ మారదు. కానీ, నిర్భయకు న్యాయం జరిగింది. సంతోషం’అని సనా అనే యువతి తెలిపారు. ఇక ఆసియాలోనే అతిపెద్దదైన తీహార్‌ జైలులో ఒకేసారి నలుగురికి ఉరితీయయం ఇదే తొలిసారి. తీహార్‌ జైలు 16 వేల మంది ఖైదీలకు కాగారారం కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. ఇక ఉరి అమలు నేపథ్యంలో జైలు వద్ద అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుద్టిమైన భద్రత ఏర్పాటు చేశారు.
(చదవండి: ఉరి అమలు: ఉదయం 3:30 గంటలకు పిటిషన్‌ కొట్టివేత)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top