నిర్భయ కేసు: దేశ చరిత్రలో ఇదే ప్రథమం​ | Nirbhaya Case Convicts Hang : First Time In Indian History | Sakshi
Sakshi News home page

నిర్భయ కేసు: దేశ చరిత్రలో ఇదే ప్రథమం​

Mar 20 2020 6:49 AM | Updated on Mar 20 2020 2:54 PM

Nirbhaya Case Convicts Hang : First Time In Indian History - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులు అక్షయ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్‌ సింగ్‌లు ఈ తెల్లవారుజామున ఉరి తీయబడ్డారు. ఇలా ఒకేసారి నలుగురు వ్యక్తులను ఉరితీయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌ జలాద్‌ వారిని ఉరితీశారు. జైలు నెంబర్‌ 3లో అధికారుల సమక్షంలో ఉరిని అమలు చేశారు. ఉరి అనంతరం దోషులను పరీక్షించిన వైద్యులు వారు మృతి చెందినట్లు తేల్చారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలు డీడీయూ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం 8 గంటలకు నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. 

కాగా, 2012 డిసెంబర్‌ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత నేడు మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది.

చదవండి : నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement