
న్యూఢిల్లీ: విద్యార్థులకు భారంగా మారిన జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సిలబస్‌ను సగానికి తగ్గించనున్నారు. సిలబస్‌ను సగానికి తగ్గించాలన్న కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం బుధవారం ఓకే చెప్పింది. ‘విద్యార్థుల పోర్షన్‌ను సగం చేస్తాం. ఇకపై వారికి అంతా బోధించాల్సిన పనిలేదు. విద్యార్థులు ముఖ్యమైన సూత్రాలు నేర్చుకుంటే చాలు. మిగతా నాలెడ్జ్‌ను తర్వాత వారు సముపార్జించగలరు. ప్రస్తుతం అతి సిలబస్ దెబ్బకు విద్యార్థులు వ్యాయామం, జీవన నైపుణ్యాలు వంటి వాటికి సమయం కేటాయించలేకపోతున్నారు’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు.