మోదీ కేర్‌’కు నిలేకనీ సాయం

Nandan Nilekani to develop IT infra for NDA's 'Modicare' health scheme - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకానికి(ఎన్‌హెచ్‌పీఎస్‌) అవసరమయ్యే సాంకేతిక వనరుల(ఐటీ) కల్పనలో సాయానికి ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నిలేకనీ అంగీకరించారని నీతి ఆయోగ్‌ తెలిపింది. మోదీ కేర్‌గా పిలుస్తున్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా మొత్తం 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆధార్‌ తరహాలోనే ఎన్‌హెచ్‌పీఎస్‌ పథకానికి కూడా భారీ స్థాయిలో ఐటీ సేవలు అవసరమని, ఆ నేపథ్యంలో ఆధార్‌ జారీ వ్యవస్థ యూఐడీఐఏ మాజీ చైర్మన్‌ నిలేకనీని సంప్రదించామని నీతి ఆయోగ్‌ అధికారి ఒకరు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top