టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.
న్యూఢిల్లీ:
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీని కలువనున్నారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీకి అనుమతి పై ఫిర్యాదు చేయనున్నారు. ఉప ఎన్నిక బ్యాలెట్ ద్వారా జరపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈసీని కోరనున్నారు.
మరోవైపు బుధవారం(రేపు) ఖమ్మం జిల్లాలో నిర్వహించే టీఆర్‌ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవం(ప్లీనరీ), బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని చెరుకూరి తోట సమీపంలో నిర్వహించే ప్రతినిధుల సభకు, సాయంత్రం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు అన్నీ సిద్ధం చేశారు.