‘సెల్యూట్‌ ముంబై పోలీస్‌.. మీపై గౌరవం పెరిగింది’

Mumbai: Cop Helps 14 Day Old Baby Choking On Safety Pin - Sakshi

ముంబై : ముంబై పోలీస్‌ అధికారి చేసిన ఓ పని సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఏం చేశాడని అనుకుంటున్నారా. నెలలు నిండని ఓ పసి ప్రాణాన్ని కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్‌ కోలేకర్‌ అనే వ్యక్తి ముంబైలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు  విధులకు వెళ్తుండగా.. 14 రోజుల శిశువు ప్రమాదవశాస్తు సేప్టీ పిన్‌ను మింగేసింది. రోడ్డుపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల నుంచి విషయం తెలుసుకున్న కోలేకర్‌ చిన్నారిని ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబానికి సహాయం చేశాడు. తన సొంత వాహనంలో చిన్నారిని సమయానికి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు శిశువుకు చికిత్స అందిచి సేఫ్టీ పిన్‌ను బయటకు తీశారు. 
(టీచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే )

ఈ విషయాన్ని ముంబై పోలీసులు గురువారం ఉదయం ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారడంతో కానిస్టేబుల్‌ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ‘సెల్యూట్‌ ముంబై పోలీస్‌...మీ మీద మాకున్న గౌరవం మరింత పెరిగింది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. (గుడ్‌న్యూస్‌: నెలాఖరుకు కోవిడ్‌-19 డ్రగ్‌ )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top