బీజేపీ మంత్రుల రాజీనామాల ఆమోదం

Mufti accepts resignations of two BJP ministers who rallied in support of rape accused - Sakshi

శ్రీనగర్‌: కఠువా హత్యాచార కేసులో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామాలను జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదివారం ఆమోదించి గవర్నర్‌కు పంపారు. కఠువాలో చిన్నారి అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బీజేపీ మంత్రులు లాల్‌ సింగ్, చంద్ర ప్రకాశ్‌ గంగలు పాల్గొనడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వారిద్దరి చేత బీజేపీ అధిష్టానం రాజీనామా చేయించింది.

సీబీఐ విచారణ జరపాలి..
కఠువా హత్యాచార కేసులో సీబీఐ చేత విచారణ జరిపించాలని నిందితుల కుటుంబం డిమాండ్‌ చేసింది. క్రైం బ్రాంచ్‌ విచారణపై తమకు నమ్మకం లేదని, తమ తండ్రి, సోదరుడు దోషులని తేలితే ఉరి తీయాలని నిందితుడు సంజీరామ్‌ కూతుళ్లు చెప్పారు. ఈ కేసు విషయమై జమ్మూ హైకోర్టు, కఠువా న్యాయవాదులు చేస్తున్న సమ్మెను విరమించాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) ఆదేశించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top