మధ్యప్రదేశ్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు | MP Minister Demands For Cow Ministry | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Jun 20 2018 10:26 AM | Updated on Oct 8 2018 3:28 PM

MP Minister Demands For Cow Ministry - Sakshi

సాక్షి, భోపాల్‌ : సాధువులు, సన్యాసులకు క్యాబినెట్‌ హోదా కట్టబెట్టి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమర్శలను ఎదుర్కొంటున్న క్రమంలో మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జీవాలను కాపాడేందుకు గో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఎంపీ మంత్రి అఖిలేశ్వరానంద్‌ వ్యాఖ్యానించారు. గత వారం అఖిలేశ్వరానాంద్‌కు గో పరిరక్షణ బోర్డు ఛైర్మన్‌గా క్యాబినెట్‌ ర్యాంక్‌ కట్టబెట్టారు. ‘రాష్ట్రంలో గోవులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.. దీనికోసం గో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి..సీఎం స్వయంగా రైతు కావడంతో పాటు తనలాంటి వారు ఈ విషయంలో ఆయనకు సాయపడతా’మని అఖిలేశ్వరానంద్‌ చెప్పారు.

మంత్రి వ్యాఖ్యలపై ట్విట్టర్‌ సహా సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు స్పందించారు. రాష్ట్రంలో తక్షణం దృష్టిసారించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని, ముందుగా వాటిని పరిష్కరించాలని సూచించారు. కాగా, గతంలో వీహెచ్‌పీ సైతం కేంద్ర, రాష్ట్ర స్ధాయిల్లో గో మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement