జయలలితకు కంగ్రాట్స్ చెప్పినందుకు... | MP IAS officer gets notice for FB post on Jayalalithaa | Sakshi
Sakshi News home page

జయలలితకు కంగ్రాట్స్ చెప్పినందుకు...

Jun 2 2016 10:11 AM | Updated on Oct 8 2018 3:17 PM

జయలలితకు కంగ్రాట్స్ చెప్పినందుకు... - Sakshi

జయలలితకు కంగ్రాట్స్ చెప్పినందుకు...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అభినందలు తెలిపిన మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి ఒకరు చిక్కుల్లో పడ్డారు.

భోపాల్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అభినందలు తెలిపిన మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి ఒకరు చిక్కుల్లో పడ్డారు. తమిళనాడులో వరుసగా రెండోసారి విజయం సాధించిన జయలలితను అభినందిస్తూ మధ్యప్రదేశ్ లోని నర్సింగ్పూర్ కలెక్టర్ శిబి చక్రవర్తి తన ఫేస్బుక్ పేజీలో అభినందలు తెలుపుతూ కామెంట్స్ పోస్ట్ చేశారు. మే 19న 'కంగ్రాట్స్ అమ్మ' అంటూ పోస్ట్ పెట్టారు.

దీంతో ఆయనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సివిల్ సర్వీసు నిబంధనలు ఉల్లఘించారంటూ ఆయనకు నోటీసు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగడంతో ఫేస్బుక్ నుంచి వాటిని తొలగించారు. ఈ వివాదంపై స్పందించేందుకు చక్రవర్తి నిరాకరించారు

జవహర్ లాల్ నెహ్రును ప్రశసించి, నరేంద్ర మోదీని విమర్శించినందుకు బర్వానీ కలెక్టర్ అజయ్ గంగ్వార్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఫేస్బుక్ లో చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement