ఎనిమిది సార్లు ఎవరెస్ట్‌ ఎక్కాడు కానీ...

Mountaineer Pemba Sherpa Goes Missing In Darjeeling - Sakshi

డార్జిలింగ్‌ : ఆయన ఎనిమిది సార్లు ఎవరెస్ట్‌ పర్వతాన్ని ఎక్కాడు.. కానీ ప్రమాదవశాత్తు ఓ హిమనీనదిలో పడి కనిపించకుండా పోయాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన పెంబా శెర్పా (47) పర్వతారోహకులలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే పేరుగాంచిన ఎవరెస్ట్‌ పర్వతాన్ని 8 సార్లు అధిరోహించాడు. మకాలు, కాంచనగంగ వంటి పర్వతాలను కూడా ఎక్కాడు.

కొన్ని రోజుల క్రితం పర్వత శిఖరం మీద నుంచి కిందకు దిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ససెర్‌ కంగ్రి అనే హిమనీనదిలో పడిపోయాడు. అప్పటినుంచి అతని జాడలేకుండా పోయింది. ఐటీబీపీ జవాన్లు, సెర్పాస్‌ ప్రజలు పెంబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెంబా భార్య మాట్లాడుతూ.. ‘‘ఆయన జూన్‌ 19న మనాలికి వెళ్తునట్లు తెల్సింది. పెంబా లోయలో పడిపోయినట్లు అతని చిన్న తమ్ముడికి శనివారం ఫోన్‌ వచ్చింద’’ని ఆమె తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top