భారత స్వాతంత్ర్య సమరంలో అసువులుబాసిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా పంజాబ్ లోని హుస్సేనీవాలా స్మారక చిహ్నం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
భారత స్వాతంత్ర్య సమరంలో అసువులుబాసిన భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా పంజాబ్ లోని హుస్సేనీవాలా స్మారక చిహ్నం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా అమృత్ సర్కు చేరుకున్న ఆయన హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకచిహ్నం వద్ద నివాళులు అర్పించిన అనంతరం విప్లవ వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్ బాదల్, విజయ్ సంపల్, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు కమల్ శర్మ తదితరులు హాజరయ్యారు.