మోదీ మ్యాజిక్ ఏమైంది? | Modi magic did not work to contain regional parties, says Shiv Sena | Sakshi
Sakshi News home page

మోదీ మ్యాజిక్ ఏమైంది?

May 20 2016 4:11 PM | Updated on Aug 21 2018 9:38 PM

మోదీ మ్యాజిక్ ఏమైంది? - Sakshi

మోదీ మ్యాజిక్ ఏమైంది?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్సాహంగా ఉన్న బీజేపీపై మిత్ర పక్షం శివసేన మరోసారి విమర్శలు చేసింది.

ముంబై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్సాహంగా ఉన్న బీజేపీపై మిత్ర పక్షం శివసేన మరోసారి విమర్శలు చేసింది.  అస్సాంలో బీజేపీ విజయం సాధించడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మ్యాజిక్ అనుకుంటే మరి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందని అధికార పత్రిక 'సామ్నా'లో ప్రశ్నించింది.

ప్రాంతీయ పార్టీలపై గెలుపొందడం అంత సులువుకాదన్న విషయాన్ని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని తెలిపింది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీపై గెలుపొందారని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోని ప్రాంతీయ పార్టీల కంచుకోటలను తాకలేకపోయారని పేర్కొంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చరమగీతం పాడిన ప్రజలు, అచ్చేదిన్ ప్రభుత్వానికి ఒక్క సీటును మాత్రమే ఇచ్చారని 'సామ్నా'లో విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement