మారిన జమ్మూ కశ్మీర్‌ ముఖచిత్రం | Modi Government Scraps Special Status To Kashmir | Sakshi
Sakshi News home page

మారిన జమ్మూ కశ్మీర్‌ ముఖచిత్రం

Aug 5 2019 11:51 AM | Updated on Aug 6 2019 8:00 AM

Modi Government Scraps Special Status To Kashmir - Sakshi

రెండు ముక్కలుగా జమ్మూ కశ్మీర్‌

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ ముఖచిత్రాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేస్తూ పలు వివరాలు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలు చేస్తూ జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లడఖ్‌ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ప్రజలు కోరుతున్నారని అమిత్‌ షా చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ ఢిల్లీ తరహాలో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. ఇక కేంద్రం నిర్ణయంతో కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. అలాగే జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

చదవండికశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement