కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మోడల్ | model escapes from kidnapers by jumping from moving car | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మోడల్

Apr 5 2016 3:22 PM | Updated on Sep 3 2017 9:16 PM

కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మోడల్

కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న మోడల్

కిడ్నాప్ ప్రయత్నం నుంచి ఓ మోడల్ తృటిలో తప్పించుకుంది. తనను ఎత్తుకెళ్లిపోవాలని చూసేవారి నుంచి తప్పించుకోడానికి ఆమె కదులుతున్న కారులోంచి దూకేసింది.

కిడ్నాప్ ప్రయత్నం నుంచి ఓ మోడల్ తృటిలో తప్పించుకుంది. తనను ఎత్తుకెళ్లిపోవాలని చూసేవారి నుంచి తప్పించుకోడానికి ఆమె కదులుతున్న కారులోంచి దూకేసింది. దాంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. తన మాజీ బోయ్‌ఫ్రెండు, అతడి స్నేహితులు కలిసి తనను తీసుకెళ్లిపోయేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. తాను అతడితో బ్రేకప్ అయిపోవడంతో కక్ష తీర్చుకోడానికే ఇలా చేశారంది. అంతేకాక, తన ముఖం మీద యాసిడ్ పోయడానికి కూడా ప్రయత్నించినట్లు చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయిఏత ఇంతవరకు ఎవరినీ అరె స్టు చేయలేదు.

ఉదయం 9 గంటలకు ఆమె తన స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఇద్దరు ముగ్గురు పురుషులు ఆమెను కారులోంచి బయటకు లాగి, బలవంతంగా తమ కారులోకి తోసేశారు. ఆమెను తీవ్రంగా కొడుతూ ముఖం మీద యాసిడ్ పోస్తామని బెదిరించారు. వాళ్లలో ఒకరిపేరు ఆమిర్ అని, మరొకరు అతడి స్నేహితుడు తయ్యాబ్ అని ఆమె చెప్పింది. ఆమిర్‌తో తాను బ్రేకప్ అవ్వడంతో వాళ్లు ఇలా చేశారని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement