మొబైల్, ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభం | Mobile internet services restored in Kashmir after Handwara incident | Sakshi
Sakshi News home page

మొబైల్, ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభం

Apr 18 2016 8:48 AM | Updated on Aug 29 2018 7:26 PM

భద్రతా కారణాలతో కశ్మీర్లో నిలిపివేసిన మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను తిరిగి సోమవారం పునరుద్దరించారు.

శ్రీనగర్: భద్రతా కారణాలతో కశ్మీర్లో నిలిపివేసిన మొబైల్, ఇంటర్ నెట్ సర్వీసులను తిరిగి సోమవారం పునరుద్దరించారు. హంద్వారా ఘటనతో అలజడి కొనసాగుతున్న నేపథ్యంలో కశ్మీర్లోని కుపార్వా, బారాముల్లా, బందీపూర, గండేర్ బల్ జిల్లాల్లో గత బుధవారం నుంచి మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు.

ఆర్మీ జవాన్ల  కాల్పుల్లో నలుగురు మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో సోషల్ మీడియాలో దుష్ర్పచారం, వదంతులు చెలరేగే అవకాశముండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement