శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం

శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం


సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం శనివారం తెలిపారు. పార్టీ  కార్యాలయంలో 135 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. మాజీ మంత్రి వలర్మతి నేతృత్వంలో శశికళకు మద్దతుగా శనివారం మరో తీర్మానాన్ని ఆమోదించారు.శశికళతో నటి విజయశాంతి భేటీ

నటి విజయశాంతి శనివారం చెన్నైలోని పోయెస్‌గార్డెన్ లో శశికళను కలుసుకున్నారు. అరగంటసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత జయలలిత సమాధి వద్దకు వెళ్లి జయకు విజయశాంతి నివాళులర్పించారు.పొత్తుకోసం బీజేపీ చర్చలు: మురళీధరరావు

అన్నాడీఎంకేతో పొత్తుకోసం చర్చలు జరుగుతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు శుక్రవారం కేరళలో జరిగిన ఒక సభలో వెల్లడించారు. కాగా, అన్నాడీఎంకేను చీల్చే ఆలోచన బీజేపీకి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్ స్పష్టంచేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top