పోలీసులపై వసల కార్మికుల రాళ్ల దాడి

Migrant Workers Clashes With Police in Surat - Sakshi

టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు, అసలేం జరిగిందంటే...

అహ్మదాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో వలస కార్మికులు, పోలీసులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. కార్మికులందరూ తమని స్వస్థలాలకు పంపాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు, కార్మికుల మధ్య జరిగిన వాగ్వవాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో వలస కార్మికులు... పోలీసులపై రాళ్లదాడికి దిగారు.

 సూరత్‌లో వస్త్ర, వజ్రాల పరిశ్రమలో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కార్మికులు గుజరాత్‌కు వస్తూ ఉంటారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వారందరూ అక్కడే చిక్కుకుపోయారు. అనేక సార్లు తమని సొంత గ్రామాలకు పంపించాలని వారు రోడ్లపై బైఠాయించి రహదారులను బ్లాక్‌ చేశారు. సోమవారం కూడా వారేలీ మార్కెట్లో కార్మికులు గుంపులుగా ఏర్పడి నిరసన తెలిపారు. అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి వెళ్లాలని కోరగా వారు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. (వలస కార్మికులపై చార్జీల భారమా!?)

అదేవిధంగా పాలన్‌పూర్‌ ప్రాంతంలో కూడా వలస కార్మికులు నిరసనకు దిగారు. తమను లాక్‌డౌన్‌ కాలంలో కూడా పనిచేయమంటున్నారని, అక్కడ వారికి సరిపడినంత ఆహారం లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వగ్రామలకు తరలించడానికి అధికారులు చొరవతీసుకోవాలని కోరారు. గుజరాత్‌లో ఏప్రిల్‌ 10న వలసకార్మికులు వాహనాలను తగులబెట్టి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా ఇప్పటి వరకు గుజరాత్‌లో 5,428 కరోనా కేసులు నమోదు కాగా, 290 మంది మరణించారు. (అత్యధిక కరోనా మరణాల రేటు రాష్ట్రంలోనే)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top