ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : మావోయిస్టు మృతి | maoist-killed-in-encounter-at-chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : మావోయిస్టు మృతి

Nov 12 2016 3:03 PM | Updated on Oct 9 2018 2:47 PM

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : మావోయిస్టు మృతి - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : మావోయిస్టు మృతి

స్పెషల్ టాస్క్‌ఫోర్సు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.

రాయ్‌పూర్: స్పెషల్ టాస్క్‌ఫోర్సు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ ప్రాంతంలోని కుధూర్‌లో శనివారం తెల్లవారుజామున నక్సల్స్ జన్ అదాలత్ నిర్వహించి గ్రామస్తులకు శిక్షలు విధిస్తున్నారన్న సమాచారం అందుకున్న నారాయణపూర్, కొండగావ్ పోలీసులు కిలమ్-తుండివాల్-కుధూర్ మార్గంలో నక్సల్స్ వెదుకులాటకు ఉమ్మడిగా బయలుదేరారు.
 
పోలీసు పార్టీ కుధూర్ గ్రామానికి చేరుకోగానే నక్సల్స్ పోలీసులపైకి కాల్పులు జరిపారు. పోలీసులు కూడా కాల్పులు జరపగా మహిళలను, పిల్లలను అడ్డుపెట్టుకుని నక్సల్స్ పారిపోయారు. కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతదేహం కనిపించింది. అక్కడి రక్తపు మరకలనుబట్టి మరికొందరు నక్సల్స్ గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన నక్సల్‌ను కొట్మెపార గ్రామానికి చెందిన ఎల్‌ఓఎస్ మావోయిస్టు ఏరియా డిప్యూటీ కమాండ ర్ బోటి కశ్యప్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపినట్లు నారాయణపూర్ ఎస్పీ అభిషేక్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement