పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్నా : ప్రముఖ దర్శకుడు | Manipuri Producer Returns Padma Shri Against Citizenship Bill | Sakshi
Sakshi News home page

పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తున్నా : ప్రముఖ దర్శకుడు

Feb 3 2019 8:48 PM | Updated on Feb 3 2019 8:58 PM

Manipuri Producer Returns Padma Shri Against Citizenship Bill - Sakshi

ఇంపాల్‌‌: మణిపూర్‌ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరొందిన అభిరాం శ్యామ్‌ శర్మ తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లుకు నిరసనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఈశాన్య భారతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని 83 ఏళ్ల శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో 500కు పైగా ఎంపీలు ఉంటే తమ రాష్ట్రం నుంచి కేవలం ఒక్కరిద్దరే ఉన్నారని.. తమ ఆవేదనను ఎలా వ్యక్తపరుస్తారని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాలను కూడా గౌరవించాలనీ.. తమపై ఈవిధంగా వివక్ష చూపడం సబబు కాదని శర్మ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా.. కేంద్రం బలవంతగా బిల్లును అమలుచేయడం సరికాదన్నారు. ఇషనౌ, ఇమాగి నింగతెమ్ వంటి సినిమాలు శర్మకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన చిత్ర పరిశ్రమకు సేవలను గుర్తిస్తూ..  ప్రభుత్వం 2006లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement