పఠాన్‌కోట్‌లో మరో కారు.. అలాగే దోపిడీ! | Manhunt in Punjab after car snatched at gun-point | Sakshi
Sakshi News home page

పఠాన్‌కోట్‌లో మరో కారు.. అలాగే దోపిడీ!

Mar 23 2016 11:06 AM | Updated on Sep 3 2017 8:24 PM

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జల్లాలో మళ్లీ కలకలం రేగింది. ఉగ్రదాడి సమయంలో తుపాకి చూపించి ఓ ఎస్పీ కారు ఎత్తుకెళ్లినట్లే.. ఈసారి ఓ పౌరుడిని తుపాకితో బెదిరించి అతడి కారును కొంతమంది సాయుధులు ఎత్తుకెళ్లారు.

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జల్లాలో మళ్లీ కలకలం రేగింది. ఉగ్రదాడి సమయంలో తుపాకి చూపించి ఓ ఎస్పీ కారు ఎత్తుకెళ్లినట్లే.. ఈసారి ఓ పౌరుడిని తుపాకితో బెదిరించి అతడి కారును కొంతమంది సాయుధులు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి పఠాన్‌కోట్ జిల్లాలోని సుజన్‌పూర్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈసారి మాత్రం జరిగిన ఘటనలో ఉగ్రకోణం ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందుజాగ్రత్తగా జిల్లాలో హై ఎలర్ట్ ప్రకటించారు.

ఫోర్డ్ ఫిగో కారులో వెళ్తున్న వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు ఆపారని, అతడిని తుపాకితో బెదిరించి బలవంతంగా కిందకు దించారని పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వాళ్లలో ఇద్దరు కారులో పారిపోగా మూడో వ్యక్తి మోటారు సైకిల్‌పై వెళ్లాడన్నారు. పఠాన్‌కోట్ - జమ్ము హైవే మీద పఠాన్‌కోట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే సుజన్‌పూర్ నగరం ఉంది. ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కారు దోపిడీ ఘటనను కూడా భద్రతాదళాలు తీవ్రంగానే పరిగణిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement