అక్క కాదన్నదని.. చెల్లిని దారుణంగా! 

Man Raped And Murder A minor Girl In Uttarakhand - Sakshi

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో ఇటీవల జరిగిన ఓ బాలిక హత్యకేసుకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరకాశి జిల్లాలో ఓ యువకుడు శనివారం ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం హత్యకేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించారు. తన ప్రేమను తిరస్కరించిందని.. ఓ యువకుడు ఆ యువతి సోదరిపై అత్యాచారం జరిపి హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ముఖేష్‌ లాల్‌ (22) అనే యువకుడు గతకొంత కాలంగా ఓ బాలికను ప్రేమించాలని వేధిస్తున్నాడు. దానికి ఆ బాలిక తిరస్కరించడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆమెను హత్యచేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. గత శుక్రవారం బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో​ ఇంట్లోకి ప్రవేశించాడు. పొరపాటున ఆ బాలికను కాకుండా ఆమె సోదరి(11)ని కిడ్నాప్‌ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేశాడు. బాలికను హత్యచేసే ముందు ఆమెపై అత్యాచారం కూడా జరిపినట్లు విచారణలో నిందితుడు తెలిపినట్లు పోలీసులు ప్రకటించారు. 

శనివారం ఆ గ్రామ సమీపంలోని కల్వర్టులో బాలిక శవాన్ని గుర్తించిన అనంతరం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉపాది కోసం తమ రాష్ట్రానికి వచ్చిన వారే ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నారని, వారిని తక్షణమే రాష్ట్రం నుంచి వెల్లగొట్టాలని పలు హిందూ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. దీంతో గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కాగా ఈ ఘటనతో ఎవరికి సంబంధం లేదని నిందితుడు ఒక్కడే హత్యచేసినట్లు పొలీసులు ప్రకటించారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top