కుక్క మొరగడంతో మొదలైన ఘర్షణ ఓ యువకుడి ప్రాణా లు తీసింది. భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్‌ను ఆదివారం రాత్రి బెంగళూరు లోని ఓ దుకాణంలో కొంతమంది టీవీలో చూస్తున్నారు.
సాక్షి, బెంగళూరు: కుక్క మొరగడంతో మొదలైన ఘర్షణ ఓ యువకుడి ప్రాణా లు తీసింది. భారత్-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్‌ను ఆదివారం రాత్రి బెంగళూరు లోని ఓ దుకాణంలో కొంతమంది టీవీలో చూస్తున్నారు. జాన్ కెనడీ అనే వ్యక్తి తన కుక్కతో ఆ షాపుకు వచ్చాడు. కుక్క అరుపులు చికాకు తెప్పిస్తున్నాయి.. దాన్ని తీసుకెళ్లు అని అవినాష్ (20), కెనెట్ చెప్పారు. అయినా అతడు వెళ్లలేదు. దీంతో వారు కెనడీపై దాడికి దిగగా, అవినాష్, కెనెట్‌పై కెనడీ బీరు బాటిల్‌తో దాడిచేశాడు. గాయపడిన అనినాష్ ఆస్పత్రిలోచికిత్సపొందుతూ మరణించాడు.