'నా చావుకు లాక్‌డౌన్‌ పొడిగింపే కారణం'

Man Deceased In UP Unable To Care For Family Due To Lockdown  - Sakshi

లక్నో : తన చావుకు లాక్‌డౌన్‌ పొడిగింపే కారణమంటూ ఒక వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి శుక్రవానం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ విషాద ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సహజన్‌పూర్‌ జిల్లాకు చెందిన భానుప్రకాశ్‌  గుప్తా హోటల్‌లో పనిచేస్తుండేవాడు.  భార్య, నలుగురు పిల్లలు, తల్లితో కలిసి గుప్తా అక్కడే ఒక ఇంట్లో అద్దెకు నివసిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో అతని గుప్తా కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ విధించిన మొదటిరోజుల్లో ఎలాగోలా కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇంతలోనే తల్లి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరగడంతో దాచుకున్న డబ్బులు మొత్తం అయిపోయాయి. కాగా కరోనా మహమ్మారి దేశంలో మరింత విజృంభిస్తుండడంతో కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భానుప్రకాశ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబపోషణ భారమైపోయింది. దిక్కులేని స్థితిలో ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించాడు. శుక్రవారం సాయంత్రం లఖింపూర్‌ ఖేరి జిల్లా  రైల్వే స్టేషన్‌కు చేరుకొని సూసైడ్‌ నోట్‌ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. (కరోనా వైద్య పరీక్షల్లో తేలిందేమిటి?)

భానుప్రకాశ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌లో.. ' లాక్‌డౌన్‌ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం మాకు రేషన్‌ కోటా కింద గోధుమలు, బియ్యం మాత్రమే ఇచ్చింది. ప్రభుత్వం సాయం చేసినందుకు కృతజ్ఞతలు.. కానీ వారు చేసిన సాయం నా కుటుంబానికి సరిపోదు. ఇంట్లోకి కావలసిన పాలు, పెరుగు, ఉప్పు లాంటి నిత్యావసరాలు కొనడానికి  నా దగ్గర డబ్బు కూడా లేదు. సరిగ్గా ఇదే సమయంలో నా తల్లి అనారోగ్యానికి గురవడంతో ఆమెకు చికిత్సనందించేందుకు డబ్బులు కూడా లేవు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దగ్గర వాపోయినా వారు పట్టించుకోలేదు. అందుకే ఆత్యహత్యే శరణ్యమని భావించా' అంటూ పేర్కొన్నాడు.('చైనా ఉత్పత్తులను నిషేదిద్దాం')

ఇదే విషయమై లఖింపూర్‌ ఖేరీ జిల్లా మెజిస్ట్రేట్‌ శైలేంద్ర కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ' భానుప్రకాశ్‌ ఆత్మహత్యకు సంబంధించి ప్రాథమిక విచారణను పూర్తి చేశాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పని లేక ఇంట్లోనే ఉంటున్న భాను కుటుంబానికి రేషన్‌ కోటా కింద తగినంత సరుకులు అందించాం. భాను చనిపోయిన చోట మాకు సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది.  అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలపై ఇన్విస్టిగేషన్‌ను ముమ్మరం చేస్తాము'.  

కాంగ్రెస్‌ నేత ప్రియంక గాంధీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ' ఇది నిజంగా దురదృష్టకర సంఘటన. యూపీకి చెందిన భాను గుప్తా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం నన్ను కలచివేసింది. లాక్‌డౌన్‌ వల్ల అతని పని ఆగిపోయింది. సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న ప్రకారం ఆయనకు ప్రభుత్వం నుంచి రేషన్ మాత్రమే వచ్చింది. కానీ అతని లేఖలో ఇతర వస్తువులను కొనడానికి డబ్బులేవని రాశాడు.  ఇతర అవసరాలు కూడా ఉన్నాయి. దేశంలో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు ఎంతో మంది లేఖలు రాశారు. కానీ భాను గుప్తా సూసైడ్‌ నోట్‌ మాత్రం ఆయనకు చేరదనుకుంటా. కానీ దయచేసి గుప్తా రాసిన లేఖను చదవి అతని కుటుంబానికి న్యాయం చేయండి' అంటూ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

13-07-2020
Jul 13, 2020, 17:51 IST
సింగ‌పూర్: కోవిడ్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం సింగ‌పూర్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఏ ఒక్క‌రు కోవిడ్ నిబంధ‌న‌ల(స‌ర్క్యూట్ బ్రేక‌ర్‌)‌ను...
13-07-2020
Jul 13, 2020, 15:48 IST
పారీస్‌: కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్‌ కట్టడి కోసం దేశాలన్ని లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్థికంగా ఇప్పటికే ఎంతో నష్టాన్ని...
13-07-2020
Jul 13, 2020, 15:30 IST
కోల్‌క‌తా :  త‌న భార్య‌కు క‌రోనా సోకింద‌ని భార‌త మాజీ ఆల్ రౌండ‌ర్, మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా వెల్ల‌డించారు....
13-07-2020
Jul 13, 2020, 14:39 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సంక్షోభం ప్రపంచంతోపాటు భారత ఆర్థికవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ...
13-07-2020
Jul 13, 2020, 14:04 IST
ప‌ట్నా: ఏమాత్రం అజాగ్ర‌త్తప‌డ్డా మ‌నుషుల్ని పీడించేందుకు క‌రోనా ర‌క్క‌సి సిద్ధంగా ఉంటుంది. చిన్న‌పాటి నిర్ల‌క్ష్యం కూడా క‌రోనాకు మ‌రింత చేరువ...
13-07-2020
Jul 13, 2020, 13:16 IST
సాక్షి, ముంబై : విలక్షణ నటుడు సోనూ సూద్‌ (46) మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌...
13-07-2020
Jul 13, 2020, 13:03 IST
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు....
13-07-2020
Jul 13, 2020, 12:24 IST
కోవిడ్‌ కారణంగా వీధి వ్యాపారుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది..రెక్కాడితే గానీ డొక్కాడని వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం జగనన్న తోడు...
13-07-2020
Jul 13, 2020, 11:47 IST
జైపూర్‌: ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌...
13-07-2020
Jul 13, 2020, 09:35 IST
కరోనా జిల్లా వాసులను కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.కరోనా నియంత్రణ విధులు నిర్వహించే పోలీస్‌ విభాగంలోనూ కలకలం సృష్టిస్తోంది....
13-07-2020
Jul 13, 2020, 07:34 IST
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంపై కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత నాలుగు నెలలతో పోలిస్తే.. ప్రస్తుతం వైరస్‌ రాకెట్‌ వేగంతో విస్తరిస్తోంది....
13-07-2020
Jul 13, 2020, 06:59 IST
ధారూరు: ధారూరుకు కరోనా ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మండలంలో ఈ రోజు వరకు ఒక్క...
13-07-2020
Jul 13, 2020, 04:22 IST
ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా...
13-07-2020
Jul 13, 2020, 03:57 IST
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్‌–19 కేసుల సంఖ్య 35 వేలు దాటిపోవడంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. వారాంతపు...
13-07-2020
Jul 13, 2020, 03:35 IST
సాక్షి, అమరావతి : ఎప్పటికప్పుడు కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో భాగంగా సర్కారు మరింత వేగాన్ని పెంచింది. ఏఎన్‌ఎంల ద్వారా...
13-07-2020
Jul 13, 2020, 03:33 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు మాస్క్‌తో కనిపించారు. అమెరికాలో కరోనా వైరస్‌ ప్రబలంగా ఉన్న సమయంలోనూ మాస్క్‌...
13-07-2020
Jul 13, 2020, 03:31 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 15,000 మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లోఆస్పత్రుల...
13-07-2020
Jul 13, 2020, 03:25 IST
విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇక్కడి జీజీహెచ్‌లో చికిత్స పొందారు. 14 రోజులు...
13-07-2020
Jul 13, 2020, 03:24 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోంది. పాజిటివ్‌ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు చేరువవుతున్నాయి....
13-07-2020
Jul 13, 2020, 03:11 IST
మాస్కో: కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకొని ప్రపంచదేశాలు విలవిలలాడుతున్న వేళలో వ్యాక్సిన్‌పై జరుగుతున్న ప్రయోగాలు చీకట్లో చిరుదీపంలా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top