భార్య ఆన్‌లైన్ వ్యభిచారం.. పట్టించిన భర్త | Sakshi
Sakshi News home page

భార్య ఆన్‌లైన్ వ్యభిచారం.. పట్టించిన భర్త

Published Sat, Feb 27 2016 11:56 AM

భార్య ఆన్‌లైన్ వ్యభిచారం.. పట్టించిన భర్త - Sakshi

న్యూఢిల్లీ:  గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్‌లో భార్య సాగిస్తున్న వ్యభిచార వ్యాపారానికి సైబర్ క్రైం పోలీసుల సహాయంతో చెక్ పెట్టాడో భర్త. ఇళ్లలో పని చేస్తోందనుకున్న తన భార్య అసలు స్వరూపం తెలుసుకుని షాకయ్యాడు. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు పట్టిచ్చాడు. ఇదంతా న్యూఢిల్లీలో  చోటు చేసుకుంది.
 
ఆన్లైన్‌లో తన భార్య చేస్తున్న పాడు పని గురించి తెలుసుకుని భర్త  మొదట షాకయ్యాడు. భార్య స్నేహితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెపై నిఘా పెట్టాడు. పనిమనిషి ముసుగులో భార్య సాగిస్తున్న వ్యాపారం వెలుగులోకి వచ్చింది.  ఆన్లైన్ లో సాగిస్తున్న కార్యకలాపాల గుట్టు రట్టయింది. దీనికి సంబంధించిన రెండు వీడియోలలో తన భార్య కూడా దర్శనమివ్వడంతో విస్తుపోయాడు. ఆనక పోలీసులకు సమాచారం అందించాడు.

ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్నానని సదరు భార్య మొదట అదంతా అబద్ధమంటూ బుకాయించింది. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాలు సాగించడంలేదని వాదించింది. కానీ ఆమె పనిచేస్తున్న  ప్రదేశంలో కూడా ఇలాంటి వ్యవహారమే నడుస్తోందని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదుచేసిన పోలీసులు,  తెరవెనుక హస్తాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement