తృటిలో తప్పిన ప్రమాదం | Major runway mishap averted at Amritsar airport | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ప్రమాదం

Jun 8 2015 1:41 PM | Updated on Sep 3 2017 3:26 AM

తృటిలో తప్పిన ప్రమాదం

తృటిలో తప్పిన ప్రమాదం

త్యం

అమృత్సర్: ఢిల్లీకి చెందిన  స్పైస్ జెట్ విమానం తృటిలో భారీ ప్రమాదం నుంచి  తప్పించుకుంది. అమృతసర్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం విమానం గాల్లోకి ఎగరడానికి  సిద్ధంగా ఉన్న క్షణంలో అకస్మాత్తుగా ఓ ట్రక్ రన్ వే పైకి  దూసుకువచ్చింది.  దీంతో   కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఉండే రన్ వే  ఒక వాహనం చొచ్చుకు రావడంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది  మధ్య వివాదం రేగింది. రెడ్ సిగ్నల్  ఉన్నప్పటికీ ఐఎఎఫ్ ట్రక్  రన్  వే పైకి వచ్చిందని  ఎటీసీ చెబుతోంది.  కాగా తృటిలో  భారీ ప్రమాదం తప్పడంతో  ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు మాత్రం తమ  భద్రతను గాలికొదిలేసిన ఇరువర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement