దుండగుల దుశ్చర్య : గాంధీ విగ్రహం కూల్చివేత | Mahatma Gandhis Statue Found Vandalised In Odisha School | Sakshi
Sakshi News home page

గాంధీ విగ్రహం ధ్వంసం

Jun 17 2019 4:10 PM | Updated on Jun 17 2019 4:10 PM

Mahatma Gandhis Statue Found Vandalised In Odisha School - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

దురాగతం : ఒడిసాలో గాంధీ విగ్రహం నేలమట్టం

భువనేశ్వర్‌ : ఒడిసాలోని బాలాసోర్‌ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మహాత్మ గాంధీ విగ్రహం నేలమట్టమైంది. గాంధీ జ్ఞాపకార్ధం స్కూలులో కేటాయించిన ఓ గదిని సైతం దుండగులు ధ్వంసం చేశారు. గది పరిసరాల్లో సిగరెట్‌ ప్యాకెట్లు, తాగిపడేసిన మద్యం బాటిళ్లను చిందరవందరగా పడేశారు. స్కూల్‌లోకి ప్రవేశించిన దుండగులు గాంధీ విగ్రహాన్ని నేలకూల్చి, తల భాగాన్ని కిందపడవేశారు.

కాగా, జూన్‌ 14న ఈ ఘటన జరిగి ఉంటుందని, వేసవి సెలవల కారణంగా స్కూల్‌ను మూసివేసిన క్రమంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్ధానిక పోలీస్‌ అధికారి సుభాన్షు శేఖర్‌ నాయక్‌ పేర్కొన్నారు. స్దానికుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement