మహా'రేప్' రాష్ట్ర | maharashtra tops in rape cases | Sakshi
Sakshi News home page

మహా'రేప్' రాష్ట్ర

Mar 16 2015 1:27 PM | Updated on Oct 8 2018 5:45 PM

మహా'రేప్' రాష్ట్ర - Sakshi

మహా'రేప్' రాష్ట్ర

మహిళలపై లైంగికదాడులు, వేధింపుల్లో మహారాష్ట్ర దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే మొదటి స్థానంలో నిలిచి తలదించుకునే పరిస్థితి కొనితెచ్చుకుంది. గత ఏడాది ఆ రాష్ట్రంలో 13,827 లైంగికదాడి, వేధింపుల కేసులు నమోదయ్యాయి.

మహిళలపై లైంగికదాడులు, వేధింపుల్లో మహారాష్ట్ర దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింటి కంటే అగ్రస్థానంలో నిలిచి సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి కొనితెచ్చుకుంది.  గత ఏడాది ఆ రాష్ట్రంలో 13,827 లైంగికదాడి, వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు కూడా కావాల్సినంత అప్రతిష్ఠను మూటగట్టుకున్నాయి.

మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన వివరాలను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం మహారాష్ట్ర తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ (13,323), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (13,267) రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 1,17,035 గా నమోదయింది.

మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి మేనకా గాంధీ వివరించారు. అందరూ మహిళలే ఉండే మహిళా పోలీస్ స్టేషన్లు మహారాష్ట్రలో ఇంకా ప్రారంభం కాలేదని, మహిళల ఫిర్యాదులు స్వీకరించేందుకు మహిళా సిబ్బందిని నియమించాలని, దాంతోపాటు మహిళా అధికారుల సంఖ్యనూ పెంచాల్సిన అవసం ఉందని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement