మందుబాబులకు మహారాష్ట్ర గుడ్‌న్యూస్‌

Maharashtra Allows Alcohol Home Delivery Amid Lockdown - Sakshi

మద్యం హోం డెలివరీకి అనుమతినిచ్చిన ‘మహా’ సర్కారు

ముంబై: మద్యం ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి అనుమతినిచ్చింది. లిక్కర్‌ షాపులు తిరిగి ప్రారంభించిన (మే 5 నుంచి)నేపథ్యంలో సామాజిక ఎడబాటు నిబంధనలకు విఘాతం కలుగుతున్న వేళ.. బీర్‌, వైన్‌ సహా అన్ని రకాల స్వదేశీ, విదేశీ బ్రాండ్లు ఇంటి వద్దకే సరఫరా చేసే వెసలుబాటు కల్పించింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరించి.. లైసెన్సు ఉన్న లిక్కర్‌ షాపులకు మాత్రమే మద్యం డోర్‌ డెలివరీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 23.401 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా... దాదాపు 868 మంది మృత్యువాత పడ్డారు. 4786 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.(లిక్కర్‌పై సుప్రీంకోర్టుకెక్కిన తమిళనాడు)

మద్యం హోం డెలివరీ- నిబంధనలు

  • షాపు విస్తరించి ఉన్న నిర్ణీత ప్రాంతం వరకే హోం డెలివరీకి అనుమతి(లైసెన్స్‌ అనుమతి ఉన్న ప్రాంతం)
  • మద్యం సరఫరా చేసే వ్యక్తి తప్పనిసరిగా మాస్కు ధరించాలి. తరచుగా హ్యాండ్‌ శానిటైజర్‌ ఉపయోగించాలి
  • నిర్ణీత గంటలు, రోజుల్లో మాత్రమే మద్యం డెలివరీకి అనుమతి ఉంటుంది
  • ఈ వెసలుబాటు లాక్‌డౌన్‌ ముగిసేవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది(ఆన్‌లైన్‌లో మద్యం విక్రయంపై ఆలోచించండి)
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top