
చెన్నై : తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మద్యాన్ని కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని స్పష్టం చేసింది. మే 17 వరకే ఆన్‌లైన్‌లో లిక్కర్ విక్రయాలను అనుమతిస్తారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా తమిళనాడులో తొలిరోజు మద్యం విక్రయాలు రికార్డు స్దాయిలో రూ 170 కోట్ల మేర సాగాయి. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 600 కోవిడ్-19 తాజా కేసులు వెలుగుచూశాయి. వీరిలో 399 మంది చెన్నై నగరానికి చెందిన వారేనని అధికారులు వెల్లడించారు.