ఏకే 47 తో విద్యార్థులు.. ఇండోర్ లో కలకలం | Madhya Pradesh students brandish AK-47s in college | Sakshi
Sakshi News home page

ఏకే 47 తో విద్యార్థులు.. ఇండోర్ లో కలకలం

Jun 12 2016 10:55 AM | Updated on Jun 4 2019 6:41 PM

ఏకే 47 తో విద్యార్థులు.. ఇండోర్ లో కలకలం - Sakshi

ఏకే 47 తో విద్యార్థులు.. ఇండోర్ లో కలకలం

మధ్యప్రదేశ్ లోని ఒక కాలేజ్ ఫంక్షన్ లో విద్యార్థులు ఏకే 47 గన్ తో డాన్స్ చేయడం కలకలం రేపుతోంది.

భోపాల్: మధ్యప్రదేశ్ లో కాలేజ్ ఫంక్షన్ లో విద్యార్థులు ఏకే 47 గన్ తో డాన్స్ చేయడం కలకలం రేపుతోంది. ఇండోర్ లోని హోల్కర్ సైన్స్ కాలేజ్  125 వ వార్షికోత్సవం  సందర్భంగా కొందరు విద్యార్థులు ఏకే 47 ను పట్టుకొని డాన్సులు చేశారు.
 
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి  చేరుకోగా,  విద్యార్థులు పారిపోయారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు, కాలేజీ యాజమాన్యం పైనా చర్యలు తీసుకోనున్నట్టు  పోలీసు అధికారి తెలిపారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement