జీతాల పెంపునకు ఓకే | madhya pradesh cabinet gives nod to salary hike of mlas | Sakshi
Sakshi News home page

జీతాల పెంపునకు ఓకే

Mar 30 2016 11:30 AM | Updated on Oct 8 2018 3:31 PM

జీతాల పెంపునకు ఓకే - Sakshi

జీతాల పెంపునకు ఓకే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లాగే మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకుంటున్నారు. అయితే, ఇక్కడ ఉన్నంత కాకుండా కొంచెం తక్కువ మొత్తంలోనే అక్కడి జీతాలు పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లాగే మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకుంటున్నారు. అయితే, ఇక్కడ ఉన్నంత కాకుండా కొంచెం తక్కువ మొత్తంలోనే అక్కడి జీతాలు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల జీతాలు రూ. 2 లక్షలకు పైగానే ఉండగా.. మధ్యప్రదేశ్‌లో మాత్రం ఎమ్మెల్యేల జీతం ప్రస్తుతం రూ. 71 వేలు ఉండగా, దాన్ని రూ. 1.10 లక్షల వంతున పెంచాలని ప్రతిపాదించగా దానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అలాగే ముఖ్యమంత్రికి ప్రస్తుతం రూ. 1.43 లక్షలు జీతం ఉండగా దాన్ని రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. మంత్రులకు జీతాలు ప్రస్తుతం రూ. 1.20 లక్షలు ఉండగా దాన్ని రూ. 1.70 లక్షలకు పెంచారు. సహాయమంత్రుల జీతాలు ఇకమీదట రూ. 1.50 లక్షలు అవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement