breaking news
mlas salary hike
-
రూ.లక్షకు పెరిగిన ఎమ్మెల్యేల వేతనం
టీ.నగర్: అసెంబ్లీలో వేతనాల పెంపు ముసాయిదాను బుధవారం ప్రవేశపెట్టారు. దీంతో ఎమ్మెల్యేల వేతనం లక్ష రూపాయలకు చేరింది. రాష్ట్ర ఎమ్మెల్యేల వేతనాన్ని పెంచేందుకు సంబం«ధించిన చట్ట ముసాయిదా అసెంబ్లీ పక్షనేత, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. ఇందుకు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మద్దతు ప్రకటించడంతో ముసాయిదాకు అంగీకారం తెలిపినట్లు స్పీకర్ ధనసాల్ ప్రకటించారు. ఈ ముసాయిదాకు డీఎంకే తరఫున ఆ పార్టీ విప్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ముసాయిదాలోని వివరాలు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రిసీడియం చైర్మన్, డిప్యూటీ ప్రెసిడీయం చైర్మన్, ప్రతిపక్ష నేత, ప్రభుత్వ విప్, అసెంబ్లీ సభ్యుల వేతనాలు ఎనిమిది వేల రూపాయల నుంచి రూ.30 వేలకు పెరిగాయి. ఇదే విధంగా పలు రాయితీలు కల్పించారు. అసెంబ్లీ మాజీ సభ్యుల పింఛన్ 12 వేల రూపాయల నుంచి రూ.20 వేలకు పెంచారు. మాజీ సభ్యుల చట్టబద్ధమైన వారసులకు కుటుంబ పింఛన్ ఆరువేల రూపాయల నుంచి రూ.10 వేలు అందించనున్నారు. ఇలాఉండగా ఈ వేతనాలు 2017 జూలై ఒకటవ తేదీ నుంచి అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా నెరవేర్చడం ద్వారా ప్రభుత్వానికి అదనంగా ఏటా రూ.25.32కోట్ల ఖర్చు ఏర్పడనుంది. ఈ విధంగా ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ ముసాయిదా నెరవేరడంతో ఇకపై ఎమ్మెల్యేలు నెలసరి వేతనంగా లక్ష రూపాయలు అందుకోనున్నారు. -
జీతాల పెంపునకు ఓకే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లాగే మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకుంటున్నారు. అయితే, ఇక్కడ ఉన్నంత కాకుండా కొంచెం తక్కువ మొత్తంలోనే అక్కడి జీతాలు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల జీతాలు రూ. 2 లక్షలకు పైగానే ఉండగా.. మధ్యప్రదేశ్‌లో మాత్రం ఎమ్మెల్యేల జీతం ప్రస్తుతం రూ. 71 వేలు ఉండగా, దాన్ని రూ. 1.10 లక్షల వంతున పెంచాలని ప్రతిపాదించగా దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముఖ్యమంత్రికి ప్రస్తుతం రూ. 1.43 లక్షలు జీతం ఉండగా దాన్ని రూ. 2 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. మంత్రులకు జీతాలు ప్రస్తుతం రూ. 1.20 లక్షలు ఉండగా దాన్ని రూ. 1.70 లక్షలకు పెంచారు. సహాయమంత్రుల జీతాలు ఇకమీదట రూ. 1.50 లక్షలు అవుతాయి.