బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు మృతి | Lucknow cracker factory blast kills six, injures 14 others | Sakshi
Sakshi News home page

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు మృతి

Sep 20 2014 11:04 AM | Updated on Apr 3 2019 3:52 PM

ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది.

లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లక్నోలోని మహన్లాల్ గంజ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. కాగా బాణాసంచా ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేనట్లు సమాచారం. అయినా అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement